భారీ బడ్జెటే!

Wednesday, January 22, 2025

అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఫిబ్రవరి 7న గ్రాండ్ విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నే ఉన్నాయి.

అయితే, ఈ సినిమా విడుదలకి ముందే నాగచైతన్య తరువాత సినిమా గురించి సినీ సర్కిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు బయటకు వచ్చాయి. దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య తన తరువాత సినిమాని మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను సరికొత్త కథతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతుందంట.

అయితే, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.110 కోట్ల మేర కేటాయించనున్నారట చిత్ర బృందం.. ఇందులో రూ.30 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్‌కే వెచ్చించనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రొరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles