కోలీవుడ్ స్టార్ రజినీకాంత్, యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న “కూలీ” సినిమా ప్రస్తుతం అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం తమిళంలోనే కాదు, తెలుగులో కూడా భారీగా ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యువతలో ఈ సినిమాపై ఉత్సాహం ఎక్కువగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో నిన్న నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. కేవలం మన రెండు రాష్ట్రాల్లోనే మొదటి రోజుకే 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య చూసినప్పుడే కూలీ క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతుంది.
ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మాణం చేపట్టిన సన్ పిక్చర్స్, ఈ సినిమాను అత్యద్భుతమైన విజువల్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి సినిమా విడుదల తర్వాత అంచనాలను ఎంతవరకు అందుకుంటుందనే విషయంపై ఉంది.
