రాజస్థాన్‌ లో భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ !

Saturday, December 21, 2024

తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఈ కుర్ర హీరో అల్లుడు శీనుతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శ్రీనివాస్ ఆ తరువాత వరుస సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ హీరో గత ఏడాది తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి మూవీ హిందీ రీమేక్ లో హీరోగా నటించారు. కానీ ఈ సినిమా అంతగా ఆకర్షించలేదు.

తాజాగా ఈ యంగ్ హీరో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ కీలక అప్డేట్‌ని ప్రకటించారు. ఈ సినిమాలో ఎంతో కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను రాజస్థాన్‌ లో ప్రారంభించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ లోని కోటలలో పది రాత్రులు సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకే ఎంతో కీలకమని చిత్ర యూనిట్ ప్రకటించింది .ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ లో కొంత టాకీ పార్ట్ కూడా పూర్తి చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles