టాలీవుడ్‌లో యంగ్ హీరోగా పేరొచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుసగా భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందుతున్న “ది ఇండియన్ హౌస్” అనే సినిమా. ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ సముద్ర సన్నివేశం కోసం శంషాబాద్‌లో ఓ పెద్ద వాటర్ ట్యాంక్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కానీ ఈ సెటప్ సమయంలో ఓ అనుకోని ఘటన చోటు చేసుకుంది.
సీన్ చిత్రీకరణ సమయంలో ట్యాంక్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ఆ ప్రాంతంలో నీరు అంతా ఒక్కసారిగా వెళుతుండటంతో చుట్టుపక్కల హడావుడి నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ కెమెరామెన్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. అంతేకాకుండా మరో ఇద్దరు సభ్యులకు కూడా స్వల్ప గాయాలు అయినట్టు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి టీమ్ అందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సినిమా యూనిట్‌లో దిగులును కలిగించింది. ఇలాంటి భారీ సెట్లో ఇలా తట్టుకోలేని ప్రమాదం జరగడం అందరినీ కలచివేసింది. అయినా గాయపడినవాళ్లంతా త్వరగా కోలుకోవాలని సినీ ప్రపంచం మొత్తం కోరుకుంటోంది.
ప్రస్తుతం ఈ ఘటనపై యూనిట్ పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాపై ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్ చూస్తే, కథా నిర్మాణం, టెక్నికల్ విలువల పరంగా కూడా ఇది ఎంతో విభిన్నంగా ఉండబోతోందని చెబుతున్నాయి.
