టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇక వీరి బ్యానర్‌పై ఓ బాలీవుడ్ చిత్రం కూడా తెరకెక్కుతోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న ‘జాట్’ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు మైత్రి మూవీ మేకర్స్ రెడీ చేస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఇదే బ్యానర్‌లో మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాబీ హృతిక్‌ని కలిసి ఓ కథను వినిపించాడని.. దానికి హృతిక్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
మరి నిజంగానే హృతిక్ టాలీవుడ్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో కలిసి హృతిక్ ఇప్పటికే ‘వార్-2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.