కేవలం ఈ భాషల్లోనే వార్‌ 2 విడుదల!

Friday, December 5, 2025

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “వార్ 2” అని చెప్పాలి. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారి స్పై యూనివర్స్ లో భాగమైన సినిమా ఇది కాగా దీనిపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే మొత్తం ఐదు భాషల్లో కాకుండా కేవలం మేకర్స్ మూడు భాషల్లో మాత్రమే ఈ సినిమా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, హిందీ, సహా తమిళ్ భాషలో మాత్రమే ఈ సినిమాని మేకర్స్ లాక్ చేసుకున్నారని తెలుస్తుంది. సో కన్నడ, మళయాళ భాషల్లో వార్ 2 లేనట్టే అనుకోవాలి. ఎన్టీఆర్ కి కన్నడలో కూడా మంచి క్రేజ్ ఉంది. మరి ఈ ఆగస్ట్ 14న వార్ 2 ఎలా రాబోతుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles