ఏంటి టిల్లన్న ఇంత స్టైలిష్‌ గా అయినావు!

Sunday, December 22, 2024

యంగ్‌ స్టార్‌ హీరో సిద్దుజొన్నలగడ్డ చివరిగా టిల్లు స్క్వేర్‌ సినిమాలో కనిపించి మెప్పించారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ గా నిలిచి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత  భాగాన్ని కూడా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు సిద్ధు. అయితే ఈలోగా తన తదుపరి సినిమా తెలుసు కదా మూవీ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో చేస్తుండగా, నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 5, 2024న హైదరాబాద్‌లో మొదలు కానుంది. మూవీ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు త్వరలో అప్డేట్ అవ్వనున్నాయి. అయితే ఈ సినిమా కోసం సిద్ధు స్టైలిష్ లుక్ లోకి మారిపోయి అందర్ని ఆశ్చర్యపరిచాడు. అందుకు సంబంధించిన లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ లో సిద్దు చాలా బాగున్నాడు. ఈ లుక్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తెలుసు కదా చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి 30వ సినిమా ఇది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles