ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటించిన ‘డ్యూడ్’ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించిన ప్రదీప్, ఈసారి పూర్తిగా యువతను ఆకట్టుకునే లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో తెరపై మెరిశాడు. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించాడు.
సినిమా విడుదలైన మొదటి రోజునుంచే థియేటర్ల దగ్గర మంచి హడావుడి కనిపించింది. యువతకు దగ్గరైన కథ, ప్రదీప్ కామెడీ టైమింగ్, రొమాంటిక్ ట్రాక్ ఇలా అన్ని కలిసి సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చాయి. దీపావళి సెలవులు కూడా కలిసి రావడంతో ‘డ్యూడ్’ వసూళ్ల పరంగా గట్టి దూకుడు చూపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.83 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ వేగం చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల మార్క్‌ను చేరే అవకాశముంది.
