టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం మిరాయ్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, రిలీజ్ అయిన తర్వాత యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఉన్న యాక్షన్ సీక్వెన్సులు, కథనం, ట్రీట్మెంట్ ప్రేక్షకులను థియేటర్స్‌కి బంధించాయి.
సినిమా కంటెంట్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన వస్తుండటంతో, పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద హైప్ సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురుస్తున్నాయి. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.134.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. ఈ జోరు కొనసాగితే త్వరలోనే 150 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి.
