కల్కి సినిమాలో కమల్‌ పాత్ర ఎంతసేపంటే!

Andhrawatch
1 Min Read

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ ..ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌ తో వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్  ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

 అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని ఆడిపాడనున్నారు. బిగ్గెస్ట్ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న”కల్కి” మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.హిందూ పురాణ కథల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్.. విష్ణుమూర్తి ‘కల్కి’ అవతారంలో కనిపించబోతున్నట్లు సమాచారం.  

ఈ సినిమా ఏకంగా 5 పార్ట్స్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ పాత్ర సినిమాలో ఎంటర్‌ అవ్వబోతుందట. కమల్‌ ఎంట్రీతో సినిమా కథ కీలక మలుపు తిరుగనుందని చిత్ర బృందం వెల్లడించింది. మొదటి పార్ట్ లో కమల హాసన్ పాత్ర నిడివి కేవలం 20 నిముషాలు మాత్రమే ఉంటుందని సమాచారం.సెకండ్ పార్ట్ లో మాత్రం కమల్ పాత్ర దాదాపు గంటకు పైగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ  వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌  అవుతుంది.

Share This Article