సారంగపాణి జాతకం ఎలా ఉందంటే!

Monday, December 8, 2025

టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో ప్రియదర్శి, రూప కొడువాయుర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా కట్ చేశారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష చేసే కామెడీతో ఈ ట్రైలర్ పూర్తి ఫన్ రైడ్‌గా కొనసాగుతుంది. జాతకాన్ని నమ్మే హీరోకి ఎలాంటి కష్టాలు ఎదురౌతున్నాయో.. అతడి ప్రేమకు ఎలాంటి సమస్య ఎదురైంది.. వాటన్నింటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, హర్షలతో కలిసి ప్రియదర్శి చేసే కామెడీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles