ప్రభాస్‌ కోసం రంగంలోకి దిగిన హాలీవుడ్‌ నటుడు!

Tuesday, January 21, 2025

ప్రభాస్‌ నటించిన ఇటీవలి తాజా సినిమా కల్కి. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టిందని ఇండస్టరీ టాక్‌.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ లిస్ట్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్‌’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మూడు వందల కోట్ల తో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ సినిమాను పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడని టాక్‌ వినిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు హాలీవుడ్‌ స్టార్‌ ‘మా డాంగ్-సియోక్ ను’ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. అంతే కాదు సినిమాలోని యాక్షన్ స్టంట్స్ కోసం కొరియన్ స్టంట్ కొరియోగ్రాఫర్‌లను తీసుకొచ్చేందుకు రెడీగా ఉన్నారంట మూవీ మేకర్స్.

‘స్పిరిట్ కథ’ కూడా ఇంటర్నేషనల్‌ స్థాయిలో ఉండబోతుందట. అందుకే మేకర్స్ ఈ సినిమాను పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మా డాంగ్-సియోక్ సౌత్ కొరియన్, హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ‘ట్రైన్ టు బుసన్’, ‘ది అవుట్‌లాస్’, ‘అన్‌స్టాపబుల్’, ‘ది కాప్’, ‘ది డెవిల్’, ‘ది గ్యాంగ్‌స్టర్’, ‘ఛాంపియన్’, ‘డిరైల్డ్’, ‘ది బ్యాడ్ గైస్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో విలన్ గా నటించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles