హమ్మయ్యా ఓపెన్‌ అయిపోయింది!

Friday, March 28, 2025

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు మహానటి అంటే ఇలానే ఉంటుందన్న రీతిలో ఆ పాత్రలో ఒదిగిపోయింది.  అయితే కీర్తి సురేష్ గత కొంత కాలంగా హీరోయిన్ గా ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తుంది.

తాజాగా కీర్తి అయితే హిందీలో “బేబీ జాన్” సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఇక ఈ సినిమా సమయంలోనే లేటెస్ట్ గా పలు రూమర్స్ ఆమె పెళ్లి విషయంలో చాలా బయటకు వచ్చాయి. అయితే ఆమె తన స్నేహితునితోనే ప్రేమలో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతుంది అని పలు విషయాలు బయటకు వచ్చాయి.

అయితే వాటిపై అపుడు ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇవి నిజమే అని చాలా మంది అనుకున్నారు. ఇక ఫైనల్ గా కీర్తి సురేష్ వీటిపై ఓ క్లారిటీ అయితే ఇచ్చేసింది. తన ఆంటోనీ తోనే గత 15 ఏళ్ళు నుంచి ప్రేమలో ఉన్నట్టుగా తమ ప్రేమకి 15 ఏళ్ళు పూర్తి అయ్యినట్టుగా ఎక్స్ వేదికగా కన్ఫర్మ్ చేసింది. దీంతో ఆమె అభిమానులు సహా సినీ ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles