ఈసారైనా హిట్‌ కొట్టేనా..లేదా!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్‌ ఖాతాలో ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా పడలేదు. కొంత కాలం క్రితం వచ్చిన సినిమా కూడా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో  కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి కొత్త సినిమాలను ప్రకటిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా నితిన్ నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్ ‘.. . ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తర్వాత వెంకీ కుడుముల, నితిన్ కాంబోలో  రాబోతున్న సినిమా అని తెలిసిందే.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన   టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పేరుకు తగ్గట్టేఈ సినిమా  బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనాలు చేసి పేదలకు పంచిపెట్టే కాన్సెప్ట్ అని మాత్రం అంతా అనుకుంటున్నారు.  నితిన్ ను దొంగగా ఈ సినిమాలో చూపిస్తున్నాడు డైరెక్టర్.  తాజాగా శ్రీరామనవమి సందర్బంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. రాబిన్ హుడ్ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.. డిసెంబర్ 31 వరకు ఈ సినిమాకు టైం కలిసోస్తుంది.

ఆ టైం కు పోటీగా వేరే సినిమాలు కూడా ఏమి లేవు. దాంతో ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయం మాత్రం తెలియలేదు. మరోవైపు రాశి ఖన్నాను సంప్రదించినట్లు తెలుస్తుంది.. త్వరలోనే హీరోయిన్ ఎవరినేది అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles