హిట్‌ 3 ..లాస్ట్‌ మినిట్‌ లో ..!

Friday, December 5, 2025

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందించారు. ఇక ఈ సినిమాలో నాని చేయబోయే రక్తపాతం ప్రేక్షకులను స్టన్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే సెన్సార్ పనులు కూడా ముగించుకున్న ఈ చిత్రానికి చివరి నిమిషంలో మెరుగులు దిద్దుతున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు ఉంది. అయితే, ఒక 5-8 నిమిషాల నిడివిని తగ్గించేందుకు కొన్ని సన్నివేశాలను తగ్గిస్తున్నారంట శైలేష్ అండ్ టీమ్. ఫైనల్ రన్‌టైమ్ లాక్ చేసి కాపీలను థియేటర్లకు పంపిస్తారంట.

మొత్తానికి ‘హిట్-3’ ఇలా రిలీజ్‌కు మరికొద్ది గంటల ముందుకు ట్రిమ్మింగ్ చేస్తుండటంతో ఈ వార్త సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles