హిందీ రైట్స్ రెండింతలా!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమా ఏదైనా ఉంది అంటే ‘పుష్ప-2… నే.’ ఈ మూవీ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత గ్రాండ్‌ గా తీర్చిదిద్దుతున్నాడు. ఫస్ట్ పార్ట్ అందుకున్న భారీ విజయానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సారి ‘పుష్ప-2’ మూవీపై ఉత్తరాదిన కూడా భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఈ సినిమా కోసం హిందీ బెల్ట్‌లో తీవ్ర పోటీ ఏర్పడింది. తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన హిందీ రైట్స్‌ను మేకర్స్ అత్యంత భారీ ధరకు అమ్మినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప తొలి భాగానికి ఇది రెండింతల రేటుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ‘పుష్ప-2’ మూవీపై నార్త్ ఆడియెన్స్ ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారనే విషయం తెలుస్తుంది.  ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక  హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles