బాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న ఎపిక్ మూవీస్ లో టాలెంటెడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ అలాగే సాయి పల్లవి కాంబోలో డైరెక్టర్ నితీష్ తివారి తీర్చిదిద్దుతున్న భారీ సినిమా ‘రామాయణ’ . మరి ఈ సినిమాలో రణబీర్ రామునిగా సాయి పల్లవి సీతగా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ రెండు భాగాలుగా ఈ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో ఆల్రెడీ పార్ట్ 1 షూటింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
ఇక లేటెస్ట్ గా పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారట. ప్రస్తుతం సాయి పల్లవిపై లంకలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ తర్వాత రణబీర్ పై సన్నివేశాలని తెరకెక్కించనున్నారట. సో ఇలా పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుందని చెప్పాలి. ఇక వీటిలో పార్ట్ 1 ఈ ఏడాదిలో దీపావళి కానుకగా రిలీజ్ కానుండగా పార్ట్ 2 ని 2027కి లాక్ చేసినట్లు తెలుస్తుంది..
