ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి విజయం సాధించింది. ప్రేక్షకుల స్పందనను చూసిన తర్వాత, ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రానున్న దేవర పార్ట్ 2 పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌లో షూటింగ్ మొదలవుతుందని సమాచారం.
దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం కథను పూర్తిగా సిద్ధం చేశాడని తెలుస్తోంది. రాబోయే వారం ఎన్టీఆర్ కు పూర్తి కథను వినిపించనున్నారు. ఈ సీక్వెల్ కోసం కొరటాల స్క్రిప్ట్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశాడట. అలాగే కొత్త ట్విస్టులు, పాన్ ఇండియా లెవెల్‌లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ కూడా జోడించాడని సినీ వర్గాల సమాచారం.
మొదటి పార్ట్‌లో లేని కొత్త పాత్రలను కూడా ఈసారి చేర్చినట్లు టాక్. ముఖ్యంగా ఒక కీలక రోల్ చుట్టూ కథ నడిచేలా మార్పులు చేశారట. జాన్వీ కపూర్‌తో పాటు మరో హీరోయిన్ ఈ సీక్వెల్‌లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ మరలా కనిపించనున్నాడు.
