మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో యూత్ స్టార్ నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల కాంబో లో చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “రాబిన్ హుడ్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొనగా మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ ని ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రాబోతుంది. అయితే ఈ చిత్రంలో తాజా గానే ఓ స్పెషల్ సాంగ్ ఉందని చిత్రబృందం ప్రకటించింది.
మరి ఈ స్పెషల్ సర్ప్రైజ్ కి డేట్ అండ్ టైం ని లాక్ చేశారు. ఈ సాంగ్ లో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ షైన్ కానుంది. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 20న విడుదల అవుతుంది.