ఆ సాంగ్‌ లో ఆమె ఎంట్రీ అదిరింది!

Tuesday, January 21, 2025

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు టి జె జ్ఞానవేల్ తెరకెక్కించిన మోస్ట్‌ అవైటెడ్ సాలిడ్ మాస్ అండ్ సోషల్ డ్రామా సినిమా “వేట్టైయన్”. ఈ సినిమాని రానా దగ్గుబాటి అలాగే బిగ్ బి అమితాబ్ లాంటి గ్రాండ్ తారాగణంతో రూపొందించిన విషయం తెలిసిందే.  ఈ సినిమాపై డీసెంట్ బజ్ అయితే ప్రస్తుతానికి ఉంది. ఇక ఈ భారీ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ మనసిలియో ని తాజాగా అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు.

మరి అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మాస్ లో అదరగొట్టగా ఈ సాంగ్ వచ్చిన తర్వాత రజినీ కాంత్ ని మించి మరో నటి సర్ప్రైజింగ్ సాంగ్‌ లో ఇవ్వడంతో ప్రస్తుతం పాట వైరల్ గా మారిపోయింది. ఇంతకీ  ఆమె ఎవరో కాదు నటి మంజు వారియర్. ఈ సాంగ్ లో ఆమె పెర్ఫార్మన్స్ కోసం నెటీజన్స్ ఓ రేంజ్ లో ఉందనే టాక్‌ వినిపిస్తుంది. అసలు ఈ సాంగ్ లో మంజు వారియర్ ని అయితే ఇలా ఊహించలేదు అని అంతా అనుకుంటున్నారు.

దీంతో ఈ సాంగ్ వచ్చాక తలైవర్ స్వాగ్, అనిరుద్ బీట్స్ తో పాటుగా మంజు వారియర్ ఒక సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ అక్టోబర్ 10న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles