సీనియర్ నటుడు సుమన్ సినిమాలతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఇటీవల ఆయన అల్లూరి జిల్లా పాడేరుకు వెళ్లి అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న కరాటే ట్రైనింగ్‌ను దగ్గరగా పరిశీలించి విద్యార్థులను ప్రోత్సహించారు. గిరిజన ప్రాంతాల పిల్లలకు కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ అందుబాటులోకి రావాలని తన వంతు సహాయం చేస్తానని సుమన్ తెలిపారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం కలిగిన వ్యక్తి కావడంతో పాఠశాల స్థాయిలోనే కరాటే శిక్షణ అందించే ప్రయత్నాలు జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కూడా ఆ దిశగా ముందుకు వచ్చి కొంతమేరకు సహకరిస్తానని చెప్పారు.
