అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా నుంచి తాజాగా మూడో సింగిల్ సాంగ్‌గా ‘హైలెస్సో హైలెస్సా’ విడుదల చేశారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ సినిమాలో నాగచైతన్య చించేశాడని.. ఇంత ఎర్లీగా చెప్పడం సాహసమే అని.. అయినా ధైర్యం చేసి చెబుతున్నానని.. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలుస్తుందని అల్లు అరవింద్ అన్నారు.
ఇలా నాగచైతన్య పాత్ర, ఆయన పర్ఫార్మెన్స్‌పై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా ఉన్నాయి.ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్నారు.