ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న సినిమా “మిరాయ్”. యువ నటుడు తేజ సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస బుకింగ్స్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమాకి మేకర్స్ ఇప్పటికే విజయోత్సవం కూడా నిర్వహించారు.
ఆ ఈవెంట్‌లో నిర్మాత విశ్వ ప్రసాద్, హీరో తేజ సజ్జ ఇద్దరూ ఒకే ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రానికి తెరపై కనిపించకపోయినా రానా దగ్గుబాటి కీలక కారణమని వారు తెలిపారు. రానా తనకు ఏ వ్యక్తిగత లాభం లేకపోయినా సినిమాకి వెనక నిలబడి సహాయం చేశాడని అన్నారు.
హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలన్న ఆలోచన మొదట రానాదే అని, దాని కోసం ఎవరికెవరికీ మాట్లాడాలో, ఏ విధంగా ముందుకు వెళ్లాలో మొత్తం ఆయనే సహకరించారని తేజ వివరించాడు. అంతేకాక, తనకు పెద్ద ఉపయోగం లేకపోయినా సినిమాలో చిన్న పాత్రను కూడా రానా చేసాడని చెప్పాడు.
