టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా, అందులో దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ పై ప్రత్యేకమైన హైప్ నెలకొంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల శ్రీకాంత్ ఓదెల ఒక ట్వీట్ చేసిన వెంటనే అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇక ఈ భారీ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారనే ప్రశ్న ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనిరుద్‌దే. ఆయన పేరు ఫ్యాన్స్ మధ్య బాగా వినిపిస్తున్నందున, ఈసారి మెగాస్టార్ సినిమాకే మ్యూజిక్ అందించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అనిరుద్ “ది ప్యారడైజ్” అనే ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
