ఆయనతో తండేల్ డైరెక్టర్! ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ జరుపుకుంటూ విడుదలకి రాబోతున్న తాజా సినిమాల్లో టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ “తండేల్” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ అక్కినేని నాగ చైతన్య అలాగే సాయి పల్లవిలు హీరోయిన్స్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం.
దీంతో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నార్త్ ప్రమోషన్స్ ఆల్రెడీ చేస్తుండగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఈ ప్రమోషన్స్ లో భాగం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మీట్ లో అమీర్ ఖాన్ తో ప్రాజెక్ట్ పై చందూ చేసిన కామెంట్స్ మంచి ఆసక్తికరంగా మారాయి. అమీర్ ఖాన్ నెక్స్ట్ సినిమాకి తాను ఒక ఆరు నెలలు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యాలి అనుకుంటున్నాను అంటూ ఆ తర్వాత మంచి కథ చెప్తానని తనతో ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.