ఘట్టమనేని వారి శుభలేఖ చూశారా..ఎలా ఉందో!

Wednesday, January 22, 2025

ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బజా మోగనుంది. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా చాలా చక చక జరుగుతున్నాయి. అతిథులకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా మొదలైపోయింది. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరథ మహారథుల మధ్య ఘనంగా చేయనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు.

ఘట్టమనేని సత్యనారాయణ(సత్తిపండు) కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చి||ల|| సౌ. వసుంధర కి ఇచ్చి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్ల పక్ష ఆషాడ త్రయోదశి నాడు అనగా ఆగస్టు 9న వివాహం జరిపించుటకు అభిమానులు పెద్దల సమక్షలో నిశ్చయించినారు. కావున తామెల్లరు విచ్చేసి, మా ఆతిధ్యం స్వీకరరించి వేద పండితుల సాక్షిగా ఒక్కటవుతున్న మా చిరంజీవులు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము అని ఘట్టమనేని వారి కుటుంభ సభ్యులు అంటూ ఓ వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింట తెగ షికారు చేస్తుంది.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే ఆగస్టు 9న ఘట్టమనేని సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్‌ డే. ఆ సందర్భంగా మహేశ్ నటించిన కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన మురారి చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా విడుదల అయ్యింది. దీంతో అభిమనులు ఈ రీరిలీజ్ ను చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు గాను ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన పత్రికలను డిజైన్ చేసి ప్రతి ఒక్క అభిమానిని అభిమానంగా ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. మురారి తో పాటు ఒక్కడు చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

ఒక్కడు ఉదయం రెండు ఆటలు, మురారి సాయంత్రం రెండు ఆటలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ప్లాన్ చేసారంటే రీ రిలీజ్ నాటికీ ఇంకెంత హంగామా చేస్తారో ఈ ఘట్టమేని అభిమానులంటూ అందరూ ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles