మహావతార్‌ డిలిటెడ్‌ సీన్స్‌ చూశారా..!

Tuesday, December 9, 2025

పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాల్లో “మహావతార్ నరసింహ” ఒకటి. మొదట రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఎలాంటి అంచనాలు లేకపోయినా, వసూళ్ల పరంగా ఈ సినిమా ఊహించని స్థాయిలో దూసుకెళ్లి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం 50 రోజుల విజయవంతమైన ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక డిలీటెడ్ సీన్‌ను విడుదల చేసి అభిమానుల్లో కొత్త ఆసక్తి రేకెత్తించారు.

ఆ సీన్‌లో హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ప్రహ్లాదుని హతమార్చమని ఆదేశించే సన్నివేశం ఉంటుంది. అయితే చివరికి ప్రహ్లాదుని తాను చంపలేని స్థితికి చేరుకుంటాడు. ఆ కోపంతో మద్యం తాగిన హిరణ్యకశ్యపుడికి తన ప్రతిబింబం ప్రత్యక్షమై, చిన్న పిల్లవాడినే నీవు చంపలేకపోతే విష్ణువును ఎలా ఓడిస్తావు అంటూ ఎగతాళి చేస్తుంది. ఈ సీన్‌ను చూసినవారు, ఇది కూడా థియేటర్ వెర్షన్‌లో ఉంటే మరింత ఇంపాక్ట్ ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles