జక్కన్న సినిమాలో మహేష్‌ లుక్‌ చూశారా!

Tuesday, September 17, 2024

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ అభిమానులు తన తరువాత సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ తన తరువాత మూవీ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

రాజమౌళి ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం “ఎస్ఎస్ఎంబి 29” అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన అప్ కమింగ్‌  మూవీ “హరోం హర” ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు మహేష్ ,రాజమౌళి మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

మహేష్ రాజమౌళి సినిమా కోసం కంప్లీట్ గా చేంజ్ అవుతున్నాడని…ఫుడ్ విషయంలో ఎంతో కేర్ తీసుకునే మహేష్ ప్రస్తుతం ఎలాంటి లిమిట్స్ లేకుండా ఫుడ్ తినేస్తున్నాడని….నిత్యం వర్క్ అవుట్ చేస్తూ ఎంతో కష్ట పడుతున్నాడని….మహేష్ డెడికేషన్ చూస్తుంటే ఎంతో  ఆశ్చర్యం వేసిందని సుధీర్ బాబు తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles