మళ్లీ లీకులు మొదలైయ్యాయా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇది చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా తెరకెక్కిస్తుండగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక షూటింగ్ అంతా ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండగా ఈ సినిమాని డైరెక్టర్ బుచ్చిబాబు ఒక సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు అని తెలిసిందే. అయితే ఇది వరకు పలు రూమర్స్ ఈ సినిమా ఆ ఆట మీద ఈ ఆట మీద అంటూ రూమర్స్ వచ్చాయి కానీ ఇపుడు ఈ సినిమా పై క్రేజీ లీక్ బయటకి వచ్చింది. ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు షూట్ పై అప్డేట్ ఇస్తూ పవర్ క్రికెట్ అంటూ ఒక లైన్ కూడా ఇచ్చేశారు.
దీంతో ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ తాలూకా క్రికెట్ బ్యాటింగ్ పవర్ కూడా మామూలు లెవెల్లో ఉండదని తెలుస్తోంది. కొడితే బాల్ ఎక్కడికో వెళ్లి పడాల్సిందే అట. అంతటి పవర్ ఉన్న బ్యాట్స్ మెన్ లా కనిపిస్తాడని కూడా ఇలాంటి సీన్ ఒకటి ఆల్రెడీ షూట్ చేసినట్టు కూడా తెలుస్తోంది.