పవన్‌ వ్యాఖ్యలకు హారీష్‌ ఎన్‌కౌంటర్‌!

Sunday, December 22, 2024

నాలుగు రోజుల క్రితం జరిగిన అటవీ శాఖ మీటింగ్‌ లో పవన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ప్రముఖ నటుడు రాజ్ కుమార్ లాంటి హీరోలు అటవీ సంపాదన దోచుకునే వాళ్ళ భరతం పట్టే అటవీశాఖ అధికారులుగా కనిపించి మెప్పిస్తే… ఇప్పటి హీరోలు మాత్రం స్మగ్లర్లుగా కనిపిస్తున్నారు అంటూ పవన్‌ కీలక కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయం మీద డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు.  మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. మిస్టర్ బచ్చన్ అనేది ఒక నిజాయితీగల అధికారి కథ అని చెప్పడంతో ఇప్పుడు అంతా డిఫరెంట్ ట్రెండు సాగుతోంది. స్మగ్లర్లు, క్రిమినల్స్ ను హీరోలుగా చూపిస్తున్నారు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను హరీష్ ముందు ఉంచితే దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి సామాజిక బాధ్యత ఉందనే విషయం అందరికీ తెలిసిందే.. దానికి తోడు ఇప్పుడు ఆయన అటవీ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఆ సందర్భంలో అటవీ శాఖలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఒక సినిమా రిఫరెన్స్ తీసుకుని ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ నేను పర్సనల్‌ గా ఎవరు సినిమాని చూసి ఇన్ఫ్లూయెన్స్ అవ్వరు అని అనుకుంటున్నాను, పక్కనున్న స్నేహితుడిని లేదా సంఘటనని చూసి ఇన్స్పైర్ అవుతారు కానీ ఒక సినిమాను చూసి ఇన్ఫ్లూయెన్స్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను.

అయితే ఈ విషయంలో నేను కూడా తప్పు అవ్వొచ్చని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమా చూసి సాఫ్ట్వేర్ బ్యాచ్ గొడ్డలి పట్టుకుని తిరుపతి వెళ్ళిపోలేదు కదా. రామారావు గారు రావణాసురుడు పాత్ర చేశాడు అంటే సీతను పట్టుకుని వెళ్లిపోయే పాత్ర… ఆయన్ను చూసి హీరో పక్కనోడి భార్యను ఎత్తుకెళ్తున్నాడు అని ఎవరైనా కామెంట్ చేశారా? కాదు కదా. నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలు చేయాలి కదా అంటూ హారీశ్‌ కామెంట్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles