ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పై హారీష్‌ శంకర్‌ కామెంట్స్‌!

Andhrawatch
1 Min Read

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం తన తరువాత సినిమా మిస్టర్ బచ్చన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. రవితేజ,  భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ అజయ్ దేవగన్ సూపర్ హిట్ రైడ్  అధికారిక రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇది కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా హరీష్ చేతిలో ఉండనే ఉంది. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ సందర్భంగా హరీష్, పవన్ తో తన సినిమా గురించి ఓ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ చిరకాల జ్ఞాపకాలను అందిస్తుంది. క్యాసెట్లు, డీవీడీలు ఎలా భద్రపరుస్తామో అలాగే ఈ సినిమా కూడా అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానులకు ఎప్పటికీ ప్రత్యేక చిత్రమే అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. ఈ సినిమాలో  శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.

దర్శకుడు దశరథ్‌ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Share This Article