పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు ఇప్పుడు రీలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇప్పుడు ఒక్కసారిగా హైప్ పెరిగిపోతోంది. ఇప్పటికే సినిమా పనులు పూర్తయ్యాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో దర్శకులు, నటీనటులు సినిమాపై ఉన్న బంధాన్ని, జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో దర్శకుల్లో ఒకరిగా ఉన్న జ్యోతి కృష్ణ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ మామెంటును పంచుకున్నారు. ఇది తన కెరీర్‌కు సంబంధించినది కాదని, జీవితంలో మర్చిపోలేని క్షణమని అన్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో ఆయన భార్య, కూతురు, తండ్రి అయిన ఏ ఎం రత్నం గారు, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ముఖ్యంగా పవన్ తన కూతురు అహానాను ముద్దుగా ఎత్తుకున్న ఆ క్లిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అహానా పుట్టినరోజు సందర్భంగా ఈ ఫోటోను షేర్ చేస్తూ తాను ఎంత గర్వంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో చెప్పారు. పవన్‌కి పర్సనల్‌గా దగ్గరైన ఈ ఫ్యామిలీ మూమెంట్‌కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు ఈ జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతుంది.
