100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్..ట్విట్టర్‌ వేదికగా దర్శకుడి స్పెషల్ పోస్ట్‌!

Wednesday, January 22, 2025

ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీకి దిగి సూపర్ హిట్‌ అందుకున్న చిన్న సినిమా హనుమాన్. ఈ సినిమా విడుదలై నేటితో 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా సినిమా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ట్విట్టర్‌ వేదికగా స్పెషల్‌ పోస్ట్‌ పెట్టాడు. మా హనుమాన్ సినిమా విడుద‌లై 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. హనుమాన్ వంద రోజుల వేడుకలను థియేటర్లలో జరుపుకోవడం నా లైఫ్ టైం రికార్డు. నేటితో అది జ‌రిగింది.

ఇటీవ‌ల కాలంలో ఒక చిన్న సినిమా వచ్చి థియేట‌ర్‌ల‌లో వంద రోజులు కంప్లీట్ చేసుకోవ‌డం అనేది చాలా అరుదైన విషయం. ఈ మైలురాయిని అందించినందుకు ప్రేక్షకులకు,  ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉండి నాకు మద్దతునిచ్చిన మీడియా మిత్రులకు, నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ పేర్కొన్నాడు.

ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్షన్‌ లో  వ‌చ్చిన ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా  కథా నాయకుడిగా న‌టించాడు. . బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ళను వసూలు చేసింది’. ఇక ఇదే సినిమాకు ముగింపు సీక్వెల్లో ఉంటుంద‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.

‘హనుమాన్‌’ సీక్వెల్ ‘జై హనుమాన్‌’ అనే టైటిల్‌తో రానుంది. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న కథతో ఈ సినిమా . 2025లో థియేటర్లలోకి రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles