ఓటీటీ డేట్‌ ఖరారు చేసుకున్న జింఖానా!

Andhrawatch
1 Min Read

గతేడాది విడుదలైన మలయాళ యూత్‌ ఫుల్‌ ప్రేమ కథ”ప్రేమలు”తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నెస్లన్, తన తదుపరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం “జింఖానా”. కామెడీ మరియు బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా, అంచనాల మేరకు ఓ మోస్తరు స్పందనను సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి దర్శకుడు ఖలీద్ రెహమాన్. కామెడీ, ఎమోషన్, స్పోర్ట్స్ మిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆయన కథను నడిపించారు. ముఖ్యంగా యంగ్ ఆడియన్స్‌కు ఈ సినిమాలో ఉండే హ్యూమర్ మరియు స్పోర్ట్స్ థీమ్ బాగా నచ్చేలా ఉంది.

ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ అయిన సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. మలయాళం వర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్‌లో కూడా ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించవచ్చు.

అయితే తాజాగా సోనీ లివ్ వారు ప్రకటించిన ప్రకారం, జూన్ 13 నుంచి “జింఖానా” స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ఎంటర్టైన్‌మెంట్‌గా నిలవనుంది.

- Advertisement -

కామెడీ, యూత్ ఎలిమెంట్స్‌తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఓసారి ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. థియేటర్‌కి వెళ్లి చూడలేకపోయినవారు, ఈసారి ఓటిటిలో మాత్రం మిస్ కాకుండా చూడొచ్చు.

Share This Article