గుంగురు..గుంగురు..!

Sunday, December 22, 2024

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన తాజా సినిమా ‘విశ్వం’  ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా బృందం రూపొందించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘గుంగురు గుంగురు’ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ పాట పూర్తి మాస్ బీట్స్‌తో ఆకట్టుకునే లిరిరక్స్‌తో ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌కి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేయడం మరో విశేషం. ఇక ఆయనే స్వయంగా ఈ పాటను పాడారు కూడా. ఈ పాటలో గోపీచంద్, కావ్య థాపర్‌లు అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం అయితే చేశారనే చెప్పుకొవచ్చు. మొత్తానికి ఈ పాటపై చిత్ర యూనిట్ మాత్రం ఫుల్ల్‌ కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు.

‘విశ్వం’ సినిమాలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, విటివి గణేశ్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌తో పాటు వేణు దొనెపూడి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles