గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం చక్కటి స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో, క్రీడలతో ముడిపడి ఉండే డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇప్పటికే సినిమా యూనిట్ సగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని టీమ్ చెబుతోంది. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసి అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుండగా, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
