నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దసరా సీజన్‌కు రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మేకర్స్ వేగంగా పని చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు.
ఇదిలా ఉంటే, అఖండ 2 తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇది బాలకృష్ణ కెరీర్‌లో 111వ సినిమాగా తెరకెక్కనుంది. గతంలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బాలయ్యకు మాస్ హిట్ అందించిన గోపీచంద్ మళ్లీ ఆయనే డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారని తెలియడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
ఇటీవల అమెరికాలో జరిగిన తెలుగు ఫెస్టివల్‌లో పాల్గొన్న గోపీచంద్ మలినేని, ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన మాటల ప్రకారం, బాలయ్యను ఈ సినిమాలో మనం ఇప్పటివరకు చూడని కోణంలో చూస్తామట. ఈ స్క్రిప్ట్ చాలా పక్కాగా సిద్ధమైందనీ, ఇది మునుపటి సినిమాల కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందనీ గోపీచంద్ చెప్పాడు.
ఈ వ్యాఖ్యలతో బాలయ్య అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. గోపీచంద్ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలయ్య కొత్త యాంగిల్ చూడాలనే ఉత్సాహంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
