మంచు విష్ణు ప్రధాన పాత్రలో, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించిన “కన్నప్ప” సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కి పాన్ ఇండియా స్థాయిలో అనేకమంది టాప్ నటులు కూడా జాయిన్ కావడంతో సినిమా మరింత క్రేజ్ తెచ్చుకుంది. థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ డీసెంట్ రన్‌ని సాధించింది.
ఇక థియేట్రికల్ రన్‌కి రెండు నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైన వెంటనే ఇక్కడ కూడా పాజిటివ్ రిస్పాన్స్‌నే అందుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా మొత్తం మీద నెంబర్ వన్ ట్రెండింగ్ పొజిషన్‌లో కొనసాగుతోంది. దీంతో మంచు విష్ణు ఈ విజయం మీద చాలా సంతోషంగా ఉన్నాడు.
