రాజాసాబ్‌ గ్లింప్స్‌…విడుదల తేదీ కూడా అందులోనే!

Tuesday, January 21, 2025

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘రాజాసాబ్‌ ‘ నుంచి తాజా అప్‌డేట్‌ అభిమానుల ముందుకు వచ్చేసింది. రాజాసాబ్‌ నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ వీడియో ఈ సాయంత్రం విడుదలైంది. ఇందులో ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్, బీజీఎం ఆకట్టుకుంటోంది. వరుస సినిమాలతో జోరుగా దూసుకుపోతున్న యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌.. చాలా రోజుల తర్వాత ఓ క్లాస్‌లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సోమవారం సాయంత్రం “ఫ్యాన్ ఇండియా గ్లింప్స్” పేరుతో స్పెషల్ వీడియోను చిత్రబృందం అభిమానుల ముందకు తీసుకుని వచ్చింది.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన తర్వాత.. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. యంగ్‌  రెబల్ స్టార్ ఫ్యాన్స్. అసలు మారుతితో సినిమా వద్దని చెప్పిన అభిమానులే.. ఇప్పుడు రాజాసాబ్ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? అని ఎదురు చూసేలా ఈ గ్లింప్స్‌ ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ ఆ రేంజ్‌లో ఉంది మరి. ముందు నుంచి మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతూనే ఉన్నాడు. అందుకు తగ్గట్టే.. రాజాసాబ్ గ్లింప్స్ అదిరిపోయింది. చెప్పినట్టుగానే.. కరెక్ట్ టైంకి ఈ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ను చూస్తే.. అబ్బా ఎన్నాళ్లైంది ఇలా చూసి.. అనేలా అనిపిస్తున్నాడు. చాలా కలర్ ఫుల్‌గా వింటేజ్ వైబ్‌లో ప్రభాస్ లుక్ సూపర్ ఉంది.

 పూల బొకేతో బైక్ పై రాయల్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. తనకు తానే దిష్టి తీసుకోవడం ఈ గ్లింప్స్‌లో కనిపిస్తుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్‌ గా ఉంది.  ఇక ఈ 45 సెకండ్ల గ్లింప్స్‌లో రాజాసాబ్ రిలీజ్ డేట్ కూడా విడుదల చేశారు మేకర్స్. చెప్పినట్టుగానే.. 2025 ఏప్రిల్ 10న థియేటర్లలలో సందడి చేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే.. ఇదో హారర్ రొమాంటిక్ కామెడీ సినిమా అని ఓ క్లారిటీ ఇచ్చారు.  ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నట్లు సమాచారం.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles