కుబేర గ్లింప్స్‌ సూపర్ స్టార్‌ చేతుల మీదుగా..!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘కుబేర’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా.. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక వంటి స్టార్ క్యాస్టింగ్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్స్ విడుదల అయ్యాయి. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ని నవంబర్ 15న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ వీడియో గ్లింప్స్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ వీడియో గ్లింప్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది

ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ సిద్దమవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles