గెట్ రెడీ.. “డాకు మహారాజ్” రెండో ట్రైలర్ వచ్చేస్తోందోచ్! నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అలాగే శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన తాజా సినిమా “డాకు మహారాజ్”. ఈ సంక్రాంతి కానుకగా విడుదలకి వస్తున్న సినిమాల్లో ఇదీ కూడా ఒకటి కాగా మంచి హైప్ ఈ సినిమా మీద ఏర్పడింది. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ ఓ ట్రైలర్ వచ్చి అందర్ని అలరించిన సంగతి తెలిసిందే. కానీ ఏపీలో లో భారీ లెవెల్లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా ఆగిపోయింది. కానీ తాజాగా ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చే విధంగా రెండో ట్రైలర్ ని మేకర్స్ ఇపుడు సిద్ధం చేసినట్టు సమాచారం. అలాగే నేడే ఈ రెండో ట్రైలర్ కూడా వస్తుందని సమాచారం. ఇక అంతే కాకుండా ఈ ట్రైలర్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇంకా బాలయ్యపై పవర్ఫుల్ డైలాగ్స్ తో రానుందని సమాచారం. మరి ఈ ట్రైలర్ వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి.