మ్యాడ్‌నెస్‌ కి రెడీగా ఉండండి!

Sunday, January 19, 2025
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న గ్రేట్‌ ప్రెస్టీజియస్ సినిమా పుష్ప-2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో ఈ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

అయితే, ఈ ట్రైలర్ లాంచ్ పాట్నాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. కాగా, ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది.. ఎంత రన్‌టైమ్‌తో ఉండబోతుందనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప-2’ ట్రైలర్ ప్యూర్ మ్యాడ్‌నెస్‌గా ఉండబోతుందని.. అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువ ఫైర్ పుట్టించేలా ఇది ఉండనుందని అంటున్నారు. 2 నిమిషాల 44 సెకన్లు ప్యూర్ మ్యాడ్‌నెస్‌తో ఈ ట్రైలర్‌ను వీక్షించండి అంటూ వారు ఈ ట్రైలర్ లెంగ్త్ కూడా వివరించేశారు.

ఇక ఈ సినిమాలో బన్నీ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles