సంక్రాంతి మజాకాకి రెడీ అయిపోండి!

Wednesday, January 22, 2025

యంగ్ హీరో సందీప్ కిష‌న్ – దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన కాంబోలో  రాబోతున్న చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ మాస్ ఎంటర్టైనర్ కి ‘మజాకా’ అనే పేరు ఫిక్స్‌ చేశారు. టైటిల్ రివీల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. సందీప్ కిషన్ పెళ్లి కొడుకు గెట‌ప్ లో కనిపించగా.. అతని చుట్టూ పెళ్లి హ‌డావుడి ఉంది.

మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో  అయితే సందీప్ అభిమానుల్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఇదిలా ఉంటే  ధ‌మాకా త‌ర‌వాత న‌క్కిన త్రినాథ‌రావు నుంచి వ‌స్తున్న మూవీ కావడంతో ఈ మజాకా చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాత‌. రాజేష్ దండా నుంచి వ‌చ్చిన ‘సామ‌జ‌వర‌గ‌మ‌న‌’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మజాకా కూడా మంచి విజయాన్ని సాధిస్తోందని టాక్‌ వినపడుతోంది. ఈ సినిమాలో రావు ర‌మేష్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘మ‌న్మ‌థుడు’ ఫేమ్ అన్షు.. చాలా కాలం తరువాత ఈ సినిమాలో రావు ర‌మేష్ కి జోడీగా చేస్తుంది. కాగా ఈ సినిమా 2025 సంక్రాంతికి థియేటర్లలోకి రానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles