గెట్‌ రెడీ టు ప్రభాస్‌-హనూ మూవీ!

Andhrawatch
1 Min Read

హను రాఘవపూడి… ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు .. అందాల రాక్షసి తో ఇండస్ట్రీలో అందంగా అల్లుకుపోయాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథను వీర లెవల్లో తీసి బ్లాక్‌ బస్టర్‌ హిట్ ని అందుకున్నాడు. ఆ తరువాత కొంచెం నెమ్మదించినా… ఆ తరువాత వచ్చిన ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీ సీతారామంతో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.

తాజాగా ఆయన పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ఓ మూవీ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఓ వేడుకలో ఆయన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. “ఇది చారిత్రక అంశాలతో నిండిన ఫిక్షనల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఉంటుందని… ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ ఇప్పటికే మూడు పాటల్ని సిద్థం చేశారని.. ప్రస్తుతం ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని వివరించారు. ఈ చిత్రాన్ని పాన్  ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు సమచారం.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898ఎ.డి’ చిత్రంతో  బిజీగా గడుపుతున్నారు. నాగ్‌ అశ్విన్  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆయన నటిస్తోన్న ‘రాజాసాబ్‌’ చిత్రీకరణ దశలో ఉంది. వీటితో పాటు ‘సలార్‌ 2’, ‘స్పిరిట్‌’ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

Share This Article