ఫ్యాన్స్‌ రెడీ అవ్వడమ్మా..పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేస్తుంది!

Sunday, December 22, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.  గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక  హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో బన్నీ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.  ఇక మూవీ టీమ్ కూడా అప్డేట్స్ ఇస్తూ సినిమా పై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.

 రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ యూట్యూబ్ లో రికార్డులను బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. పుష్ప-2 టీజర్ భారీ వ్యూస్ తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. అతి తక్కువ టైమ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక మే డే సందర్బంగా పుష్ప పుష్ప సాంగ్ ను రేపు విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.

ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ ఫోస్టర్ లో అల్లు అర్జున్ కటౌట్ అదిరిపోయింది.. రేపు ఈ సాంగ్ ను ఎప్పుడు విందామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇకపోతే పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles