గరం..గరం అటూ రాబోతున్న నాని సరిపోదా శనివారం!

Wednesday, January 22, 2025

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న చిత్రం సరిపోదా శనివారం . ఈ సినిమా పై ప్రేక్షకుల అభిప్రాయలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ పేజీలను తిప్పేట్టప్పుడు సూర్య మ్యాడ్‌నెస్ కౌంట్‌ డౌన్‌ ను చూపించే వీడియోను చిత్ర బృందం షేర్ చేసారు.

రెండు రోజుల్లో మొదటి సింగిల్ “గరం గరం” విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. జూన్ 15న పాటను విడుదల చేయనున్నట్టు ఇంతకు ముందే చిత్ర బృందం వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నాని, వివేక్ ఆత్రేయ చేసిన కాంబో మూవీ ‘ అంటే సుందరానికి’ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఆ  ప్రాజెక్ట్ తర్వాత నాని, వివేక్, ఆత్రేయ జోడీ మళ్లీ కనిపించనుండడంతో సినీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. హైదరాబాదులో నానికిసంబంధించి వేసిన భారీ సెట్‌లో హై ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా చేస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్‌జే సూర్య ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles