గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అంజలి అలాగే కియారా అద్వానీ హీరోయిన్ గా కోలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన తాజా పొలిటికల్ యాక్షన్ సినిమా “గేమ్ ఛేంజర్”. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేదు. అయితే ఈ సినిమా థియేటర్స్, ఓటిటి రిలీజ్ తర్వాత ఇపుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయ్యింది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకున్నారు. అందులో ఈ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో తేదీ సమయం ఫిక్స్ అయ్యాయి. ఈ ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి ఈ సినిమా టెలికాస్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆల్రెడీ మాస్ ప్రమోషన్స్ కూడా ఆఫ్ లైన్ లో స్టార్ట్ చేయడం మరో విశేషం.
