ఇక నుంచి శర్వానంద్‌ ను ఆ స్టార్ అని పిలవాల్సిందే మరి!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌ యువ కథానాయకుడు శర్వానంద్ గురించి పరిచయం అక్కర్లేదు. తన సినీ కెరీర్‌ ప్రారంభంలోనే ‘గ‌మ్యం’, ‘యువ‌సేన‌’, ‘అమ్మ చెప్పింది’, ‘వెన్నెల’ సినిమాల‌తో త‌న‌కంటూ ఇండస్ట్రీలో ప్ర‌త్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అయితే శర్వాకి  ఇప్ప‌టి వరకు తెలుగులో బిరుదు లేద‌న్న విష‌యం తెలిసిందే. తాజాగా త‌న కొత్త సినిమా ఈవెంట్‌లో శర్వా బిరుదును ప్ర‌క‌టించారు మేకర్స్‌.

శర్వా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మ‌న‌మే’. మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ చేయగా.. కృతి శెట్టి హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుక‌కు టాలీవుడ్ ద‌ర్శ‌కులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్‌ల‌తో పాటు తదిత‌రులు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని కోరారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles