ఇక నుంచి పాత్రల పరిచయమే!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తున్న మెగా మల్టీస్టారర్ సినిమా ‘భైరవం’ నుంచి రోజుకో అప్డేట్ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి పోస్టర్స్, షూటింగ్ అప్డేట్స్ అంటూ సోషల్ మీడియాలో ‘భైరవం’ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మూవీలోని ఇంటెన్స్ క్యారెక్టర్స్‌ను పరిచయం చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. ఇప్పటికే ఈ సినిమాలోని లీడ్ పాత్రలు సంబంధించిన పరిచయాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, ఈ సినిమాలో కీలకంగా ఉండే మరికొన్ని ఇంటెన్స్ పాత్రలను రేపటి నుండి పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ కనకమేడల పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు.ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది హీరోయిన్లుగా నటిస్తన్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా కేకే రాధామోహన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles