టాలీవుడ్‌లో రూపొందుతున్న మరో ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘మిత్ర మండలి’ సినిమా మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాకు విజయేందర్ సత్తు దర్శకత్వం వహిస్తుండగా, ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా, విష్ణు ఓయ్, నిహారిక ఎన్ఎం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, గ్లింప్స్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ తీసుకొచ్చాయి.
పూర్తిగా హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చి తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వులతో అలరించేందుకు సిద్దమవుతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ, అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు.
‘మిత్ర మండలి’ని బన్నీ వాస్, భాను ప్రతాప్, కళ్యాణ్ మంథిన, సోమరాజు కలిసి నిర్మిస్తుండగా, సంగీతాన్ని ఆర్ ఆర్ ధృవన్ అందిస్తున్నాడు.
